సమంత విడాకులఫై ఆమె తండ్రి ఎలా స్పందించారో తెలుసా..?

నాగ చైతన్య – సమంతలు తాము విడాకులు తీసుకుంటున్నట్లు శనివారం అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన రాగానే అంత షాక్ లో పడ్డారు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు , సినీ ప్రేక్షకులు ఈ వార్త అబద్దమైతే బాగుండని అనుకున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియా లో , మీడియా చానెల్స్ లలో ఈ విడాకుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ విడాకుల ఫై ఇప్పటికే నాగార్జున స్పందించగా..తాజాగా సమంత తండ్రి జోసెఫ్ స్పందించారు. ప్రస్తుతానికి తన మెదడు శూన్యంగా ఉంది అంటూ ఆయన పేర్కొన్నారు. త్వరలోనే అన్ని పరిస్థితులు మామూలుగా మారిపోతాయి అని.. ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

‘ఏం మాయ చేశావే’ సినిమాతో నాగచైతన్య, సమంత జోడి కట్టారు. ఆ తర్వాత ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’ , మజిలీ సినిమాల్లో వీరు జంటగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. తొలి సినిమాతోనే ప్రేమలో పడిన వీరు.. 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి టాలీవుడ్‌లో లవ్లీ కపుల్‌గా వీరిద్దరు నిలిచిపోయారు. పెళ్లి తర్వాత కూడా సమంత నటించిన ‘ఓ బేబీ’ సినిమాలో చై ఓ ప్రత్యేక పాత్రలో కనిపించగా.. 2019లో వీరిద్దరు కలిసి ‘మజిలీ’ అనే సినిమాలో భార్య భర్తలుగా నటించారు.