హ్యాట్రిక్‌ వికెట్లు తీసి సామ్‌ కరన్‌ రికార్డు

sam curran
sam curran, kings XI punjab cricketer


మొహాలి: ఐపిఎల్‌లో రోహిత్‌శర్మ హ్యాట్రిక్‌ రికార్డును ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ బద్దలుకొట్టాడు. సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆటగాడు కరన్‌ రోహిత్‌ హ్యాట్రిక్‌ను అధిగమించాడు. ఐపిఎల్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడుగా కరన్‌ రికార్డు సాధించాడు. ఈ ఘనత అంతకు ముందు రోహిత్‌ శర్మ పేరిట ఉండేది. 2009లో డెక్కన్‌ ఛార్జర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన సమయంలో రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. రోహిత్‌ 22 సంవత్సరాల 6 రోజుల వయసులో హ్యాట్రిక్‌ వికెట్లు సాధించగా, కరన్‌ 20 సంవత్సరాల 302 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించడం విశేషం. కరన్‌ ఈ ఘనతను తన రెండో మ్యాచ్‌లోనే సాధించడం అద్భుతం.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/