సార్‌ మీరు త్వరగా కోలుకోవాలి..సల్మాన్‌

భావోద్వేగానికి గురైన తమన్

Salman-Khan-prays-for-SP-Balasubrahmanyam-speedy-recovery

ముంబయి: ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వస్తున్న వార్తల పై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్పందించాడు. ‘బాలసుబ్రహ్మణ్యం సర్.. మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశాడు. తనకోసం ఎన్నో పాటలు పాడి తనను స్పెషల్‌గా మార్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు. చివర్లో ‘మీ దిల్ దివానా హీరో ప్రేమ్. లవ్ యూ సర్’ అని పేర్కొన్నాడు.

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఓ వీడియోను పోస్టు చేసి బావోద్వేగానికి గురయ్యాడు. లాక్‌డౌన్‌కు ముందు మార్చి నెలలో తనకెంతో ఇష్టమైన మామ ఎస్పీబీతో చాలా సరదాగా గడిపామని, ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే తనకు కన్నీళ్లు ఆగడం లేదని పేర్కొన్నాడు. ‘మామా దయచేసి త్వరగా కోలుకోండి. ఆయన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు ప్రార్థించండి’ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కాగా, హరీశ్ శంకర్, రాధిక, మంచులక్ష్మి, సింగర్ చిన్మయి, ప్రసన్న, కుష్బూ, గీతామాధురితోపాటు పలువురు సెలబ్రిటీలు బాలు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/