ఉష్ణతాపం వల్ల నెమలికి సెలైన్‌

Peacock
Peacock

జనగాం: రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. జనాలతోపాటు మూగ జీవాలు కూడా ఎండలకు విలవిలలాడిపోతున్నాయి. అయితే జనగామ శివారులో జాతీయ పక్షి నెమలి వేడిగాలులను తట్టుకోలేకపోయింది. ఓ బోరు వద్ద వస్తున్న నీటి వద్దకు వెళ్లి.. కాసేపు సేదతీరింది. అయినప్పటికీ అది స్పృహ కోల్పోయింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని అంబులెన్స్‌ సిబ్బంది ఆ నెమలికి చికిత్స అందించింది. ఆ నెమలికి సెలైన్ ఎక్కించి ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించారు.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/