బెంగుళూరు సెక్యూరిటీ సిబ్బందిపై ఆ సంస్థ ఎండి దాష్టీకం

salim khan
salim khan

బెంగుళూరు: బెంగుళూరు సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ యజమాని ఉద్యోగుల పట్ల ప్రవర్తించిన తీరు వీడియో రూపంలో బయటకు రావడంతో యజమాని సలీంఖాన్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. సలీంఖాన్‌ అరాచకాలు ఇలాగే ఉంటాయని, విధిలేని పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నామని బాధితులు వాపోతున్నారు. సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ యజమాని సలీంఖాన్‌ బెంగుళూరు నగరంలోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో బెంగుళూరు సెక్యూరిటీ ఫోర్స్‌ అనే సంస్థను నిర్వహిస్తున్నాడు. బెంగళూరు సెక్యూరిటీ ఫోర్స్‌ సంస్థలో కర్ణాటకతో పాటు అనేక రాష్ట్రాలకు చెందిన వారు సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగం చేస్తున్నారు. పేరుకు మాత్రమే సెక్యూరిటీ ఏజెన్సీ. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను సలీంఖాన్‌ చాలా నీచంగా చూస్తాడన్న ఆరోపణలున్నాయి. సలీంఖాన్‌ ఉద్యోగులపై దాడులు చేయడం కొత్తకాదని చాలా సార్లు దాడులు చేశాడని అనేక మంది ఆరోపిస్తున్నారు. తమ తప్పు లేదని చెప్పినా ఉద్యోగుల కడుపు మీద బూటుకాళ్లతో దాడి చేస్తున్న ఒక వీడియో బయటకు రావడంతో అది వైరల్‌ అయింది. దాంతో సలీంఖాన్‌ వ్యవహరం బయటికొచ్చింది. ఇంతకాలం అతని మీద ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో సలీంఖాన్‌ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని చాలా మంది సెక్యూరిటీ గార్డులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులను హింసించడమే సలీంఖాన్‌ సంస్కారమని, బూటుకాళ్లతో ఉద్యోగుల కడుపులమీద, తలమీద దాడి చేస్తున్న సలీంఖాన్‌ చివరికి వారిని చంపేందుకు వెనుకాడడని ప్రభాత్‌ యాదవ్‌ అనే అతను ట్వీట్‌ చేశాడు. సలీంఖాన్‌ ఉద్యోగుల పట్ల ప్రవర్తించే తీరుకు వీడియోనే సాక్ష్యమని నేహాఖాన్‌ వ్యాఖ్యానించారు. సలీంఖాన్‌ అతని ఉద్యోగులను హింసించిన అరాచకాల వీడియో బయటకు రావడంతో హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ పోలీసులు సుమోటో కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారన్నారు. సలీంఖాన్‌ హిందువులను టార్గెట్‌ చేస్తూ హింసిస్తాడని, అతన్ని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారని రాహుల్‌ అనే వ్యక్తి పేర్కొన్నాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/