సలార్ నుండి బిగ్ అప్డేట్ వచ్చేసింది

బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న ప్రభాస్..ఆ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన రెండు చిత్రాలు సాహో, రాధే శ్యామ్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ప్రస్తుతం ప్రభాస్ మూడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పటికీ..అందరి కన్ను మాత్రం సలార్ పైనే ఉంది. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండడం తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంత నమ్మకం తో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా తాలూకా షూటింగ్ కొంతమేర జరిగింది. ఆ తర్వాత బ్రేక్ పడింది.

బ్రేక్ తర్వాత మరో అప్డేట్ రాకపోయేసరికి సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో మేకర్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చి అభిమానులను సంతోష పెట్టారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అఫిషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సలార్ సినిమా యొక్క చిత్రీకరణ తిరిగి ప్రారంభం అయ్యింది అంటూ ఒక నైట్ షూట్ కు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. కేజీఎఫ్ సినిమాను నిర్మించిన హంబుల్ నిర్మాణ సంస్థ దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తో సలార్ ను నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.