ఈ నెల 27న ‘సాక్ష్యం’

SAKSHYAM
SAKSHYAM

ఈ నెల 27న ‘సాక్ష్యం’

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మాతగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 27న విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో డెస్టిని సాంగ్‌ను వి.వి.వినాయక్‌ విడుదల చేశారు. అనంతరం వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ – ”ట్రైలర్స్‌, సాంగ్స్‌ చూస్తుంటే నిర్మాత అభిషేక్‌గారు సినిమాను బాగా రిచ్‌గా నిర్మించారని అర్థమవుతుంది. ప్రతి విజువల్‌ చాలా గ్రాండ్‌గా ఉంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్‌తో నేను చేసిన ‘అల్లుడు శీను’ సినిమా నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. శ్రీను ప్రతి సినిమాతో పరిణితిని సాధిస్తూ హీరోగా ఎదుగుతున్నాడు. ఈ సినిమా తనకు ఇంకా పెద్ద హిట్‌ తెచ్చి పెట్టాలి. అభిషేక్‌ నామా, డైరెక్టర్‌ శ్రీవాస్‌ గారికి సినిమా పెద్ద హిట్‌ మూవీగా నిలిచి పేరు తేవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

పూజా హెగ్డే మాట్లాడుతూ – ”27న సినిమా విడుదలవుతుంది. ఎగ్జయిట్‌మెంట్‌తో పాటు నెర్వస్‌గా కూడా ఉంది. స్పిరుచువల్‌ స్పీకర్‌ పాత్రలో నటించాను. చాలా మంది ఈ సినిమా కోసం హార్డ్‌ వర్క్‌ చేశారు. ప్రతి సీన్‌ విజువల్‌గా గొప్పగా ఉంటుంది” అన్నారు.

అభిషేక్‌ నామా మాట్లాడుతూ – ”ప్రపంచ వ్యాప్తంగా ‘సాక్ష్యం’ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ”మంచి సినిమా, కమర్షియల్‌ సినిమా, కంటెంట్‌ ఉండే సినిమా కలిసి ఓ సినిమాగా అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమానే మా సాక్ష్యం. ఇలాంటి సినిమాను ఆదరిస్తే.. మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. ఇక నేటితో వినాయక్‌గారి దర్శకత్వంలో నేను చేసిన ‘అల్లుడు శీను’ విడుదలై నాలుగేళ్లు అవుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఈ సాక్ష్యం సినిమా కోసం ఈరోస్‌ సంస్థతో కలిసి పనిచేస్తుండటం ఆనందంగా ఉంది. అభిషేక్‌గారు అన్‌కాంప్రమైజ్‌డ్‌ బడ్జెట్‌తో సినిమా తీశారు. డైరెక్టర్‌ శ్రీవాస్‌గారు అందరిలో ఓ స్ఫూర్తి నింపడం వల్లనే సినిమాను అనకున్న సమయంలో పూర్తి చేయగలిగాం” అన్నారు.