జర్నలిస్టులకు తీపి కబురు తెలిపిన సజ్జనార్

తెలంగాణ ఆర్టీసీ ఎండీ గా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్…అప్పటి నుండి వార్తల్లో నిలుస్తూవస్తున్నారు. నష్టాలఉబిలో ఉన్న ఆర్టీసీ ని లాభాల్లోకి తెచ్చేందుకు సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. తాజాగా జర్నలిస్టులకు తీపి కబురు అందించారు. ఇది వరకు అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులు బస్సు ప్రయాణంలో టికెట్ తీసుకునేందుకు .. ప్రత్యేక బస్సు పాస్ చూపించి 2/3 కన్సెషన్ ఆప్షన్ కింద టికెట్ తీసుకునేవారు. తాజాగా టీఎస్ ఆర్టీసీకి చెందిన వెబ్సైట్ నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకునేందుకు రాయితీతో కూడిన అవకాశం ఇచ్చారు సజ్జనార్. TSRTC వెబ్సైట్లో జర్నలిస్టు 2/3 కన్సెషన్ ఆప్షన్ను తీసుకొచ్చారు . ఇదే విషయాన్ని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం పట్ల జర్నలిస్టులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఈ మధ్యనే పసిబిడ్డలకు పాలిచ్చే తల్లుల కోసం ఆర్టీసీ బస్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో పసిబిడ్డలకు తల్లులు పాలిచ్చేందుకు వీలుగా బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం పట్ల అంత హర్షం వ్యక్తం చేసారు. అలాగే బస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపు పక్రియ చేపట్టాలని నిర్ణయించారు. ఇటీవల ఆయన కొన్ని బస్టాండ్లలో వివిధ సేవలకు డబ్బులను యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇలా ఏదో రకంగా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ కనపరుస్తున్నారు సజ్జనార్.