కుప్పం ఎన్నికను సాధారణ ఎన్నికల్లా భావిస్తున్నారు: సజ్జల

వైస్సార్సీపీ నేతలపై చంద్రబాబు ఆరోపణలు

అమరావతి: స్థానిక ఎన్నికల్లో వైస్సార్సీపీ అక్రమాలు కొనసాగుతున్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొనడం తెలిసిందే. ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఇన్ని కుట్రలు చేయాలా? చరిత్రహీనులుగా మిగిలిపోతారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

కుప్పం ఎన్నికను సాధారణ ఎన్నికల్లా భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు అనవసరంగా హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ప్రతి పోలింగ్ బూత్ లోనూ టీడీపీ అభ్యర్థి, ఏజెంట్ ఉంటారని, వాళ్లు ఉన్నప్పటికీ గొడవలు చేసి ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఓటర్లను టీడీపీ నేతలే ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలకు సంబంధించిన వీడియోలను కూడా ఆయన మీడియాకు ప్రదర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/