హరీష్ రావుకు సజ్జల కౌంటర్..

తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గురువారం ఓ సందర్భంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు.. ఇరు రాష్ట్రాల మధ్య డైలాగ్ వార్‌కు కారణమయ్యాయి. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తోందని.. కానీ తెలంగాణ సర్కార్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయులకు 73% ఫిట్మెంట్ ఇచ్చామని వివరించారు. అలాగే ఏపీ సీఎం జగన్ లాగా కేంద్రం షరతులకు ఒప్పుకొని ఉంటే.. ఏటా ఆరువేల కోట్లు అప్పులు తీసుకుని మరిన్ని పథకాలు ప్రవేశపెట్టే వారమని తెలిపారు. కాగా హరీష్ రావు వ్యాఖ్యలఫై వైస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే మంత్రి బొత్స ఘాటుగా స్పందించగా..తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వారి రాష్ట్ర విషయాలను వారు చూసుకుంటే బాగుంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాము స్పందిస్తే మరింత రచ్చ కావడం మినహ మరే ఉపయోగముండదని అన్నారు. ఉపాధ్యాయులతో తమ ప్రభుత్వం మంచిగా వ్యవహరిస్తుందని.. వారికి ఇప్పటికీ ఏమైనా సమస్యలు ఉంటే చర్చలు జరపడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. హరీష్ రావు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.