సాయి ధరమ్ తేజ్ ప్రేమను తిరస్కరించిన హీరోయిన్..

saitej-interview

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్..చాల గ్యాప్ తర్వాత విరూపాక్ష మూవీ తో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రేపు ఏప్రిల్ 21న విడుదల కాబోతుంది. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే క్యూరియాసిటీని పెంచేసింది.

మరోపక్క హీరో తేజ్ సైతం వరుసగా ఇంటర్వూస్ ఇస్తూ సినిమా తాలూకా విశేషాలతో పాటు తన పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసి ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన లవ్ గురించి చెప్పుకొచ్చాడు. “నేను లవ్ చేసింది మాత్రం ‘తిక్క’ సినిమాలో నాతో పాటు చేసిన ‘లారిస్సా బొనేసి’. ఆమెను నేను చాలా గాఢంగా ప్రేమించాను. ఆ సినిమాకి సంబంధించి సాంగ్ షూటింగు జరుగుతూ ఉండగా, నా మనసులోని మాటను చెప్పాను. ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం ..’ అంటూ ఆమెకి విషయం చెప్పేశాను. ‘సారీ తేజూ ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు’ అని ఆమె చెప్పేసింది. అప్పుడు మాత్రం నా హార్ట్ బ్రేక్ అయింది” అని చెప్పాడు.

“నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఒక అమ్మాయిని ప్రేమించాను. కాకపోతే డిగ్రీ పూర్తయిన తరువాత నేనే దగ్గరుండి ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించాను. ఈ విషయం మా అమ్మకి మాత్రమే కాదు .. మా కల్యాణ్ మామయ్యకి కూడా తెలుసు. ఇప్పుడు మాత్రం సోలో బ్రతుకే సో బెటర్ అన్నట్టుగా నా పని నేను చేసుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. అలాగే “నేను అభిమానించే హీరోయిన్ సమంత .. తనని నేను ఆదర్శంగా తీసుకుంటాను. ఇక నా కెరియర్ తొలినాళ్లలో నాతో సినిమాలు చేసిన రెజీనా .. సయామీ అంటే ఇష్టం” అని అన్నాడు.