వెంకీ 75 మూవీ టైటిల్ ‘సైంధవ్’

విక్టరీ వెంకటేష్ 75 వ మూవీ టైటిల్ ఫిక్స్ అయ్యింది. హిట్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కబోయే ఈ చిత్రానికి ‘సైంధవ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. దీనికి సంబదించిన ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు. మూవీ మొఘల్ డి రామానాయుడు కుమారుడి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన వెంకటేష్..అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. విక్టరీ నే తన ముందు పెట్టుకొని విక్టరీ వెంకటేష్ గా వరుస విజయాలు అందుకుంటూ వచ్చారు. ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించిన వెంకీ..తాజాగా తన 75 చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

‘హిట్2’తో ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు శైలేష్ కొలనుతో ఆయన ఈ చిత్రాన్ని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించనున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనూ ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇక గ్లింప్స్ చూస్తే.. చంద్ర ప్రస్త లోని పోర్ట్ లో హీరో ఇంట్రడక్షన్ సీన్ ని గ్లిమ్స్ లో చూపిస్తూ వెంకీ క్యారెక్టర్ ని పరిచయం చేశారు. పోర్ట్ ఏరియాలో వున్న కంటైనర్ ల మధ్య దేని కోసమో వెతుకుతూ చేతిలో ఏకే 47 గన్ ని పట్టుకుని మరో చేతిలో క్యాప్సిల్ ని పట్టుకుని వెంకీ కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ‘నేనిక్కడే వుంటాన్రా..ఎక్కడికి వెళ్లను..రమ్మను..’ అంటూ తన ముందు గుట్టగా పడివున్న విలన్ బ్యాచ్ ని ఉద్దేశించి వెంకటేష్ చెబుతున్న డైలాగ్ లు ఆసక్తికరంగా వున్నాయి.

ఈ లుక్ లో గడ్డంతో టెర్రిఫిక్ గా వెంకీ కనిపిస్తున్న తీరు ఆయన పాత్ర మేకోవర్ కూడా ఇంట్రెస్టింగ్ గా వుంది. మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ మూవీ లో హీరోయిన్ ఎవరనేది రివీల్ చేయలేదు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం, ఎస్ మణికండన్ సినిమాటోగ్రఫీ, గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ అందిస్తున్నారు.