ఇండియన్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న సైనా నెహ్వాల్‌…

Saina Nehwal
Saina Nehwal

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌-500 సిరీస్‌ నుంచి భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ తప్పుకుంది. జీర్ణాశయంలో ఇబ్బందులతో గతవారం స్విస్‌ ఓపెన్‌ నుంచి అర్థంతరంగా వైదొలగిన సైనా…తాజాగా స్వదేశంలో జరిగే ఇండియా ఓపెన్‌కూ దూరమైంది. ఆస్పత్రిలో చేరిన సైనా జీర్ణాశయ సంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ సమస్య నుంచి తాను పూర్తిగా కోలుకోవడంతో ఇండియా ఓపెన్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బా§్‌ు) అధికారులకు సైనా సమాచారమిచ్చింది. ఆల్‌ ఇంగ్లాండ్‌ నుంచి సైనా సరిగా లేదు. కడుపునొప్పితో టోర్నీ నుంచి తప్పుకుంటున్నానని చెబుతూ ఆమె మాకు లేఖ రాసిందని భారత బ్యాడ్మింటన్‌ సంఘం అధికారి ఒకరు వెల్లడించారు. ఇండియా ఓపెన్‌ మార్చి 26 (మంగళవారం)మొదలుకానుంది. సైనా నిష్క్రమణతో ఇక పివి సింధు ఇండియా ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ బరిలో నిలిచిన ఏకైక భారత షట్లర్‌-సైనా నెహ్వాల్‌ 2015లో ఇండియా ఓపెన్‌ విజేతగా నిలిచింది.

https://www.vaartha.com/news/sports/
మరిన్ని తాజా క్రిడా వార్తల కోసం క్లిక్‌ చేయరడి :