ఒలింపిక్స్‌కు సన్నద్ధమవ్వాలని..

ఆసియా చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉన్న సింధూ, సైనా

Saina, Sindhu to skip Asia Team Championships
Saina, Sindhu to skip Asia Team Championships

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధూ ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒలింపిక్స్‌్‌కు సన్నద్ధమవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిలిప్పిన్స్‌లోని మనీలాలో ఫిబ్రవరి 11 నుంచి 16వరకు జరగనున్న ఈ టోర్నిలో భారత్‌ తరపున మొత్తం 17 మంది ప్రాతినిథ్యం వహించనున్నారు. దీనిలో తొమ్మిది మంది పురుషులు కాగా ఎనిమిది మంది మహిళా షట్లర్లు ఉన్నారు. మహిళా జట్టులో మాల్విక, అశ్వినీ, అష్మిత, శికా గౌతమ్‌, ఆకర్షి కశ్యప్‌, కే మనీషా, రుతపర్ణ, గాయత్రి ఉన్నారు. పురుషుల జట్టులో అర్జున్‌, శుభంకర్‌, ధ్రువ్‌, కిదాండి శ్రీకాంత్‌, హెఎస్‌ ప్రణ§్‌ు, సాత్విక్‌ సాయిరాజ్‌, సాయి ప్రణీత్‌, లక్ష్యసేన్‌, చిరాగ్‌ శెట్టి ఉన్నారు. వీరంతా దక్షిణకొరియా కజకిస్థాన్‌తో గ్రూప్‌ ఎక్స్‌లో పోటీ పడనున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చయండి:https://www.vaartha.com/andhra-pradesh/