212వ ర్యాంక్‌ క్రీడాకారిణి చేతిలో సైనా ఓటమి

Saina Nehwa
Saina Nehwa

ఆక్లాండ్‌: భారత్‌ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు న్యూజిలాండ్‌ ఓపెన్‌లో పాక్‌ తగిలింది. ఈరోజు జరిగిన తొలి రౌండ్‌లో వరల్డ్‌ నంబరు 212 ర్యాంక్‌ క్రీడాకరణి వాంగ్‌ జియి చేతిలో సైనా ఘొర పరాజయం పాలైంది. 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 16-21, 23-21, 4-21తో సైనా ఓడిపోయింది. తొలి గేమ్‌లోనే 19ఏళ్ల వాంగ్‌ జియి సైనాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడి 2116తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఒక దశలో 1919 పాయింట్లతో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఆ తర్వాత సైనా నాలుగు పాయింట్లు సాధించి రెండో గేమ్‌లో విజయం సాధించింది.అయితే గెలుపును నిర్ణయించే మూడో గేమ్‌లో సైనా మళ్లీ తేలిపోయింది. జియి జోరును అడ్డుకోలేకపోయింది. ఈ గేమ్‌లో సైనా కేవలం 4 పాయింట్లే సాధించింది.ఫలితంగా న్యూజిలాండ్‌ ఓపెన్‌ నుంచి సైనా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.


మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/