సైనాకు నెహ్వాల్‌ మరో ఓటమి

Saina Nehwal
Saina Nehwal

హైదరాబాద్‌: భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ చైనా ఓపెన్‌లో ఘోర ఓటమి పాలైంది. ఈ ఏడాది సైనాకు అంతగా కలిసివచ్చినట్లుగా లేదనిపిస్తుంది. కాగా 24 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సైనా చైనా ప్లేయర్‌ కై యాన్‌ యాన్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. రెండో రౌండ్‌లోను నిరాశపరిచిన సైనా ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఫలితంగా 12-21 తేడాతో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. కాగా పురుషుల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ భర్త అయిన పారుపల్లి కశ్యప్‌ రెండో రౌండ్‌కి అర్హత సాధించాడు. థాయిలాండ్‌ క్రీడకారుడు సిత్తికోమ్‌పై వరుసగా విజయం సాధించి రెండో రౌండ్‌లో స్థానం సంపాదించుకున్నాడు.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/