సింధు సైనాలు పోరులో నిలిచేనా?

pv sindhu & saina nehwal
pv sindhu & saina nehwal

హాంకాంగ్‌: గత కొన్నాళ్లుగా మహిళల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్లు సైనా, సింధు వరుసగా వైఫల్యాలను ఎదుర్కుంటున్నారు. కాగా హాంకాంగ్‌ ఓపెన్‌లో ముందంజ వేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ తర్వాత సింధు ఆంరంభ రౌండ్లలోనే వెనుదిరిగేది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌ మినహా ప్రతీ టోర్నీలోనూ ఒకటి రెండు రౌండ్లకే ఇంటిదారి పట్టింది. మరోపక్క సైనా నెహ్వాల్‌ పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. ఈ టోర్నీ ద్వారా ఎలాగైనా గాడిన పడాలని ఇద్దరు పట్టుదలతో శ్రమిస్తున్నారు. హాంకాంగ్‌ ఓపెన్‌లో తొలిరోజు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. బుధవారం జరిగే తొలిరౌండ్లో సింధు ప్రపంచ 19వ ర్యాంకర్‌ అయిన కొరియా ప్లేయర్‌ కిమ్‌ గ ఇయున్‌తో, ఎనిమిదో సీడ్‌ సైనా చైనా ప్లేయర్‌ అయిన కాయ్‌ యాన్‌ యాన్‌ తో తలపడనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోస క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/