అమెరికాలో సాయి ధరమ్ తేజ్

SAIDHARAM TEJ
SAIDHARAM TEJ

మెగా హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ప్రారంభంలో ‘పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్’ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న తేజు ‘తిక్క, విన్నర్, నక్షత్రం, ఇంటెలిజెంట్, జవాన్, తేజ్ ఐ లవ్ యు’ చిత్రాలతో డబుల్ హ్యాట్రిక్ పరాజయాలను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు తేజు వీటన్నింటికి దూరంగా కొంత విరామం తీసుకొని తన లుక్ ను మార్చుకోవడానికి అమెరికా వెళ్ళాడు. కొత్త మేకోవర్ తో ఇండియా తిరిగొచ్చాక ‘నేను శైలజ’ ఫెమ్ కిశోర్ తిరుమల తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు. ఇక ఈ చిత్రం తో పాటు తేజు మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.