జగదీశ్వరుడు

ఆధ్యాత్మికం

Shirdi Sai Baba
Shirdi Sai Baba

సాయిబాబా మతాతీంగా వుండేవాడు. తననివాసాన్ని ద్వారకమాయి అనేవాడు. కాని తాను ధరించేదుస్తులన్నీ మహమ్మదీయులవలె ఉండేవి. ఏకనాద భాగవతము, భావార్థరాబాయణము పారాయణం చేయించేవాడు హిందువులతో అబ్దుల్‌కు ఖురాన్‌ నేర్పేవాడు. మహీపతి దాసరు ఒకహరిదాసు. ఆయనకు మహమ్మదీయులంటే దురభిమానం ఏకోశానా లేదు. మహీపతి తండ్రి పేరు కోనేరిరావ్‌. ఆయన సనాతన సాంప్రదాయ అయినా సంస్కృత, మరాఠీ కన్నడ భాషలతో పాటు ఉర్దు, పెరిషన్‌ ప్రారశీకు భాషలను నేర్చుకున్నాడు.

అయితే మహీపతి ఆ అయిదు భాషలపై మంచి పట్టు సాధించగలగాడు. దక్షణ దేశాన్ని ఆదిల్‌షాపరిపాలిస్తుండే వాడు. ఆయనకు ఖవాస్‌ఖాన్‌ అనే మంత్రి ఉండేవాడు. ఖవాస్‌ఖాన్‌మతము మహమ్మదీయమతమయినా, హిందూ మతంపై ద్వేషమే ఉండేదికాదు. ఒకసారి ఖవాస్‌ఖాన్‌ నరసింహాస్వామి మందిరం గుండా పోతున్నాడు. ఆ మందిరం అంతా జనులతో నిండి ఉన్నాది. కారణం ఏమిటో తెలుసుకొనటానికి ప్రయత్నించాడు.

అంతలోనే దీనులకు విందుచేసే గాత్రం ఆయన చెవులకు సోకింది. వినటానికే ఇంపు గా ఉన్నది. కానీ పూర్తి అర్థం కాలే దు. కాసేపు అక్కడే నిలబడి ఉన్నా డు. ఈలోగా సుశ్రావ్యమయిన గొంతుకతో తనను అలరించిన వ్యక్తిని చూచి, రమ్మని పిలిచాడు. రేపటినుండి తన మందిరంలో గూడా అలా చెప్పమని కోరాడు ఒక మహమ్మదీయుడు, ఒక హిందువును అలా కోరటమే విశేషం. అందుకుమనస్ఫూర్తిగా అంగీకరించాడు,

ఆ వ్యక్తి మహీపతి. మహీపతి ఖవాస్‌ మందిరానికి వెళ్లాడు. అక్కడ తనకు గల పాండిత్యంతో ఉర్దూ, పారశీక భాషలలో మంత్రిని, వారి బృందాన్ని అలరింపచేశాడు. రామయణ భాగవత, మహాభారత గాధలను చెప్పి. ఒకనాడు ఖవాస్‌ వద్దకు ఉద్యోగులు వచ్చి, లెక్కలలో తేడా వచ్చినదని, లెక్క ఎంతకు సరికావటం లేదని, మా వలనకాలేదని చెప్పారు. మహీపతిని ఖవాస్‌ పిలిచి లెక్కనుసరి చేయగలవా అని అడిగాడు. వెంటనే మహీపతి తప్పపట్టుకోగలగాడు.

ఖవాన్‌ వద్ద దవాన్‌గా ఉద్యోగం అదనంగా లభించింది. మహీపతికి దివాన్‌జీ పదవికి గుర్తుగా రాజముద్రిక ఇవ్వబడ్డది. దాన్ని ఉంగరంగా వాడుతున్నాడు మహీపతి. ఒకసారి మహీపతి బేగం తలాబ్‌ తటాకాన్ని పరిశీలిస్తున్నాడు. ఆ సమయంలో ఇద్దరు సూఫే మహనీయులు అక్కడకు వచ్చారు. వారు సోదరుడు, సోదరి. సూఫీ సాంప్రదాయానికి చెందినవారు. సోదరుడై షానుంగా మహీపతి చెల్లీ ఉంగరాన్ని అడిగాడు. మహీపతి ఇచ్చాడు.

షానుంగా ఆ ఉంగరాన్ని (రాజముద్రిక) తటాకంలో పారవేశాడు అది తన వద్దలేకపోతే తన పదవికి ముప్పు వస్తుం దని మహీపతి చెప్పాడు. సోదరి వంక చూశాడు సోదరుడు.ఆమె వెంటనే తటాకంలోనికి దిగి, చేతికి అందినన్ని ఉంగరాలు మహీపతికి ఇచ్చింది. అన్ని ఉంగరా లు ఒకేలా ఉన్నాయి. ఏది తన ఉంగరం తెలుసు కోలేక పోయాడు మహీపతి. తన రాజ ముద్రికగల ఉంగరం ఏదో తమరు చెప్పండి అని షానుంగాను అడిగాడు. షానుంగా ఒక ఉంగరాన్ని తీసి ఇచ్చాడు. ఇది నా ఉంగరమని మీరు ఎలా గుర్తించారు? అడిగాడు మహీపతి. ‘మౌత:కాఘన్‌ అని చెప్పాడు.మహీపతి మంత్రి అయిన ఖవాస్‌ను ‘మౌత్‌కాఘన్‌ అంటే ఏమిటి? అని ప్రశ్నించాడు.

‘కుళ్లుతున్న శరీరపుకంపు అనిఖవాన్‌ చెప్పాడు. మీకు కొంచెం అర్థమయింది. మరల ఆ సూఫే సోదరీ సోదరుల వద్దకు పోయి తన గురువుగా వారిని ఉండమని కోరాడు. ‘మేము నీగురువు కాదు నీ గురువు షాపురలో ఉండే భాస్కరాస్వామి అని చెప్పారు

ఆ సూఫీ మంత్రివద్ద విడ్కోలు తీసుకుని మహీపతి, తన భార్యతో భాస్కరస్వామి వద్ద దీక్షతీసుకుని మహీపతి దాసు అయ్యాడు. అనేక కీర్తనలను రాశాడు. భక్త జయదేవుని ‘జయ జగదీశహరే..వలె ఈయన రచించిన Iకోలు కోలెన్న కోలే.. కీర్తన తెలియని కన్నడిగులు ఉండరు. అన్ని అవతారాలు హరిఆయినట్టు అన్ని మతాలు ఆలోకేశ్వరునివే కదా!

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/