మెడికల్ కౌన్సిల్ పరీక్ష రాసిన బ్యూటీ
తోటివిద్యార్థినులతో సెల్ఫీకి ఫోజులిచ్చిన సాయిపల్లవి

హీరోయిన్ సాయిపల్లవి విదేశాలలో డాక్టర్ కోర్సును పూర్తిచేసిన సంగతి తెలిసిందే. ఆమెకు మెడిసిన్‌పై ఉన్న కోరికతో విదేశాలకు వెళ్లి అక్కడ చేసింది..
విదేశాల్లో మెడిసిన్ చేసిన ప్రతిఒక్కరూ కూడ ఇండియాలో డాక్టర్‌గా గుర్తింపు పొందాలంటే మెడికల్ కౌన్సిల్ నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంది..
ఆ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించినవారికి మాత్రమే డాక్టర్‌గా పట్టా ఇస్తారు. ఇండియా ప్రాక్టీస్‌కు కచ్చితంగా మెడికల్ కౌన్సిల్ పరీక్ష ఉత్తీర్ణత అయి ఉండాలి.. అందుకే సాయిపల్లవి ఆ పరీక్షకు హాజరైంది.. అయితే కరోనా కారణంగా ఆ పరీక్ష కాస్త ఆలస్యమైంది.
.అయితే తాజాగా ఆ పరీక్ష నిర్వహించారు. కేరళ తిరుచ్చిలోని ఎంఎఎం కళాశాలలో సాయిపల్లవి ఒక సాధారణ స్టూడెంట్‌గా వెళ్లి పరీక్ష రాసింది.
కరోనా కారణంగా ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజ్‌లు కూడ ధరించింది..పరీక్ష అయిపోయాగానే వచ్చే సమయంలో మాత్రం ఇతర విద్యార్షిథనులతో సెల్ఫీలు దిగేందుకు ఓకే చెప్పింది..
పరీక్ష బాగానే రాశాననే ఉత్సాహం ఆమెలో కన్పించింది.. వైద్యవృత్తిపై ఉన్న కోరికతో ఈ పరీక్ష కూడ పూర్తిచేసింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/