సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శించిన సాయి పల్లవి

ఫిదా ఫేమ్ సాయి పల్లవి పుట్టపర్తి సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శించింది. సంప్రదాయమైన చీరకట్టులో సత్యసాయి సమాధిని దర్శించుకుని నివాళులు అర్పించింది. కాగా సాయిపల్లవి తల్లి పుట్టపర్తి సత్యసాయి భక్తురాలు. అందుకే ఆమెకు సాయి అని వచ్చేలా సాయిపల్లవి అనే పేరును పెట్టినట్లు తెలుస్తోంది. తల్లి తరహాలోనే సాయిపల్లవి కూడా పుట్టపర్తి సత్యసాయి భక్తురాలు.

ఈ నేపథ్యంలోనే ఆమె పుట్టపర్తికి వచ్చి సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శించింది. ఇటీవలే నాగచైతన్యతో జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం సాయి..రానా సరసన విరాటపర్వం సినిమాతో పాటు నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.