సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ అప్డేట్ విడుదల చేసిన అపోలో

సాయి ధరమ్ తేజ్ శుక్రవారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ అపోలో హాస్పటల్ లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో వైద్య బృందం తేజ్ హెల్త్ అప్డేట్ ను విడుదల చేసారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్ లో స్పష్టం చేశారు. ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన బయటపడినట్లు తెలిపారు. ప్రధాన అవయవాలు బాగా పనిచేస్తున్నాయని… ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఇక ఈరోజు మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని..రేపు మరో హెల్త్ ప్రకటన చేస్తామని హెల్త్ బులిటెన్ లో తెలిపారు.

సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి తెలియగానే అపోలో హాస్పిటల్ కు ఆయన కుటుంబ సభ్యులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, వైష్ణవ తేజ్, అల్లు అరవింద్, చిరంజీవి భార్య సురేఖ, నాగబాబు, త్రివిక్రమ్, హీరో సందీప్ కిషన్, నిహారిక, వరుణ్ తేజ్ లు చేరుకున్నారు.