సఫారీల స్కోరు 98/5

david miller
david miller

సౌతాంప్టన్‌: భారత్‌తో మ్యాచ్‌లో స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. ఓపెనర్లుగా వచ్చిన హషీమ్‌ ఆమ్లా(6) పరుగులకే బుమ్రా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్వింటన్‌ డికాక్‌(10) బుమ్రా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. డుప్లెసిస్‌(38), వాన్‌దార్‌ దుస్సేన్‌(22) లు చాహల్‌ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఆ తర్వాత జీన్‌-పాల్‌ డుమినీ(3) కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లూ అయ్యాడు. సఫారీలు 24 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో డేవిడ్‌ మిల్లర్‌(11), ఆండిలే ఫెహ్లుక్వాయో(5)లు ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/