నాటు నాటు సాంగ్ ఫై స‌ద్గురు కామెంట్స్

నాటు నాటు సాంగ్ ఫై ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు స‌ద్గురు త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన మూవీ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు కలెక్షన్ల మోత మోగించింది. తాజాగా ఆస్కార్ బరిలో ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ నిలిచింది. దీంతో తెలుగు సినీ స్థాయి మరింత పెరిగింది. ఇప్పటికే ఎంతో మంది దీనిపై స్పందించగా..

తాజాగా ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు స‌ద్గురు నాటు నాటు పాట‌పై త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు. ‘‘నాటు నాటు’ పాటకు ప్ర‌పంచం యావ‌త్తు డాన్స్ చేస్తుంది. RRR టీమ్‌కు అభినంద‌న‌లు. కొరియ‌న్ రాయ‌బారి త‌న టీమ్‌తో నాటు నాటు పాట‌కు డాన్స్ చేశారు. వారికి కూడా అభినంద‌న‌లు’ అని తెలియ‌జేస్తూ కొరియ‌న్ ఎంబ‌సీ ఇండియా వాళ్లు పోస్ట్ చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేవారు స‌ద్గురు. ఇదిలా ఉంటె ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు స‌ద్గురు నాటు నాటు పాట‌పై త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు.

‘‘నాటు నాటు’ పాటకు ప్ర‌పంచం యావ‌త్తు డాన్స్ చేస్తుంది. RRR టీమ్‌కు అభినంద‌న‌లు. కొరియ‌న్ రాయ‌బారి త‌న టీమ్‌తో నాటు నాటు పాట‌కు డాన్స్ చేశారు. వారికి కూడా అభినంద‌న‌లు’ అని తెలియ‌జేస్తూ కొరియ‌న్ ఎంబ‌సీ ఇండియా వాళ్లు పోస్ట్ చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేవారు స‌ద్గురు. ఇదిలా ఉంటె ఆస్కార్ వేదిక‌పై నాటు నాటు సాంగ్‌ను లైవ్ ఫెర్ఫామెన్స్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ స్టేజిపై రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ‘నాటు నాటు’ సాంగ్‌ను లైవ్‌లో పాడనున్నారు. అయితే ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం యూఎస్‌లో బిజీగా గడుపుతున్న రామ్ చరణ్ .. ఆస్కార్ స్టేజిపై నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసేందుకు ఆసక్తి వ్యక్తపరిచారు.

రీసెంట్‌ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘నాటు నాటు పాటకు తారక్, నేను ఎక్కడైనా డాన్స్ చేసేందుకు ఇష్టపడతాం. అయితే ఇలాంటి పెర్ఫామెన్స్‌ను ప్రతి ప్లేస్‌లో చేయడం కష్టం. ఒకవేళ మేము ఆస్కార్స్‌లో ఉన్నట్లయితే, ఏదైనా అభ్యర్థనతో పాటు సమయం ఉంటే ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మాకు ఎంతో ఇచ్చిన ప్రేక్షకులను అలరించడానికి మించిన ఆనందం మరోటి లేదు మాకు. కానీ వేదికపై మొత్తం పాటను చేయలేం. ఎందుకంటే దీనికి చాలా శ్వాస, శక్తి అవసరం. హుక్ స్టెప్ వరకైతే ఓకే’ అన్నారు.