సచిన్‌కు టెండూల్క‌ర్‌కు అరుదైన అవార్డు

Sachin Tendulkar
Sachin Tendulkar

బెర్లిన్‌: భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. ప్ర‌తిష్టాత్మ‌క లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000 -2020 అవార్డు ద‌క్కించుకున్నాడు. గ‌త రెండు ద‌శాబ్ధాల్లో అత్యుత్త‌మ‌మైన స్పోర్ట్స్ మూమెంట్‌కు ఈ అవార్డ‌ును అందించ‌డం కోసం పోటీ నిర్వ‌హించారు. 19 మందితో పోటీప‌డిన స‌చిన్‌.. అగ్ర‌స్థానంలో నిలిచి అవార్డును ద‌క్కించుకున్నాడు. 2011 వ‌న్డే వ‌రల్డ్‌క‌ప్ విజ‌యం త‌ర్వాత స‌చిన్‌ను భార‌త ఆట‌గాళ్లు త‌మ భుజాల‌పై ఊరేగించారు. క్యారీడ్ ఆన్ ద షోల్డ‌ర్స్ ఆఫ్ నేష‌న్ (దేశాన్ని భుజాల‌పై ఊరేగించారు) అనే క్యాప్ష‌న్‌తో ఓటింగ్ నిర్వ‌హించారు. ఈ మూమెంట్‌కే ప్ర‌స్తుతం అవార్డు ద‌క్కింది. జర్మనీలోని బెర్లిన్‌లో తాజాగా అవార్డు అందుకున్నాక సచిన్ మాట్లాడుతూ..ఖఅవి చాలా అద్భుత క్ష‌ణాలు.

ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యాన్ని మాటల్లో వ‌ర్ణించ‌లేను. అత్యంత అరుదుగా దేశం మొత్తం సెల‌బ్రేట్ చేసుకునే సంద‌ర్భ‌మ‌ది. మ‌న జీవితంలో క్రీడలు ఎంత ముఖ్య‌మో, వాటి మ్యాజిక్ ఎలా ఉంటుందో దీని ద్వారా చెప్ప‌వ‌చ్చు. నాకు ప‌దేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు భార‌త్ వ‌రల్డ్‌క‌ప్ (1983) సాధించింది. అప్పుడు నాకు ఆ విష‌యం గురించి స‌రైన అవ‌గాహ‌న లెకున్నా.. అంద‌రితోపాటే సెల‌బ్రేట్ చేసుకున్నా. కొంతకాలానికి వ‌ర‌ల్డ్‌క‌ప్ విజ‌యం ఎంత ప్ర‌త్యేక‌మో తెలిసింది. మ‌రోసారి వ‌రల్డ్‌క‌ప్ సాధించాల‌నే కోరిక‌తో క్రికెట్ ఆడ‌టం మొద‌లుపెట్టా. క్రికెట్ ఆడ‌టం మొద‌లుపెట్టాక 22 ఏళ్ల త‌ర్వాత నా క‌ల ఫలించింది. వ‌ర‌ల్డ్‌క‌ప్ అందుకున్న క్ష‌ణాల‌ను వ‌ర్ణించ‌లేనుగ అని వ్యాఖ్యానించాడు. మ‌రోవైపు 19 ఏళ్ల వ‌య‌సున్న‌ప్ప‌టి నుంచే త‌న‌పై ద‌క్షిణాఫ్రికా గ్రేట్ నెల్స‌న్ మండేలా ప్ర‌భావం ఉంద‌ని చెప్పుకొచ్చాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/