పూర్తిగా నీరు ఉన్న పిచ్‌పై సచిన్‌ ప్రాక్టీస్‌….

sachin tendulkar
sachin tendulkar

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసి దిగ్గజ క్రికెటర్‌గా మన్ననలు అందుకుంటున్న సచిన్‌ టెండూల్కర్‌ ఈ స్థాయికి రావడానికి కఠోర సాధన చేశాడు. సచిన్‌ క్రికెట్‌ ఆడే సమయంలో తాను ఎలా ప్రాక్టీస్‌ చేశాడో చెప్పే వీడయోను ఒకటి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. పూర్తిగా నీరు ఉంచిన పిచ్‌పై సచిన్‌ ప్రాక్టీస్‌ చేసిన వీడియో…ఇలా కూడా సాధన చేస్తారా అనిపిస్తోంది. ఫాస్ట్‌ పిచ్‌లపై బౌలర్లను ఎదుర్కోవడానికి నీరు నింపిన పిచ్‌ను సిద్ధం చేసుకుని రబ్బరు బంతులతో సచిన్‌ ప్రాక్టీస్‌ చేసిన ఒకనాటి వీడియో అది. దాన్ని సచిన్‌ షేర్‌ చేశాడు. ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా వంటి ఫాస్ట్‌ పిచ్‌లపై ఆడటానికి ఇలా ప్రాక్టీస్‌ చేశాడట. ప్రత్యేకంగా నీటితో తడిసిన పిచ్‌లపై రబ్బరు బంతి వేగంగా రావడమే సచిన్‌ ఇలా ప్రాక్టీస్‌ చేయడానికి ప్రధాన కారణం.

ఈ వైరల్‌గా మారిన సచిన్‌ పోస్ట్‌ చేసిన వీడియోకు ఒక చక్కటి క్యాప్షన్‌ ఇచ్చాడు. ఆటపై అంకితభావం, ప్రేమ ఉంటే మనకు అదే కొత్త మార్గాలను చూపిస్తుంది. దీనికి స్పందించిన భారత మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌…సచిన్‌ ప్రాక్టీస్‌ అత్యంత స్పూర్తిదాయకమైనదిగా అభివర్ణించారు. ఇటీవల లింక్‌డన్‌లో వీడియో పోస్ట్‌ చేసిన సచిన్‌….ఒక్క చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. రిస్క్‌లేని చోటు ఉండదని, మనం సక్సెస్‌ కావాలంటే రిస్క్‌ చేయకతప్పదన్నాడు. మనకు నచ్చిన ఫీల్డ్‌లో రిస్క్‌ చేస్తే ఫలితం తప్పకుండా వస్తుందన్నాడు. తాను కూడా ఓపెనర్‌గా వెళ్లడానికి టీమిండియా మేనేజ్‌మెంట్‌ను వేడుకున్నానని, చివరకు వారికి సవాల్‌ విసిరి మరీ ముందుకెళ్లానన్నాడు. ఒకవేళ తాను ఓపెనర్‌గా విజయవంతం కాలేకపోతే మళ్లీ దాని ప్రస్తావన తీసుకురానని చాలెంజ్‌ చేసి ఆ బాధ్యతలను తీసుకున్నానన్నాడు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/