రిటైర్మెంట్‌ నిర్ణయం ధోనీకే వదిలేయండి: సచిన్‌

Sachin Tendulkar, Dhoni
Sachin Tendulkar, Dhoni

మాంచెస్టర్‌: టీమిండియా మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోని రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తల నేపథ్యంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ స్పందించాడు. రిటైర్మెంట్‌ విషయం ధోనీకే వదిలేయాలని, అందులో ఎవరూ జోక్యం చేసుకోకూడదని అన్నాడు. భారత జట్టుకు ధోని అందించిన సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని మాస్టర్‌ బ్లాస్టర్‌ చెప్పాడు. భారత జట్టులో అతడిది ప్రత్యేక స్థానం. ధోనీ లాంటి కెరీర్‌ ఎవరికి ఉంటుంది? అతడు టీమిండియాకు అందించిన సేవలే ప్రజల గుండెల్లో నమ్మకానికి అద్దం పడతాయని అన్నారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అతడు ఔటయ్యే వరకు భారత్‌ ఓడిపోలేదు. అతడు గెలిపిస్తాడనే నమ్మకం అందరిలో ఉందని సచిన్‌ పేర్కొన్నాడు.

వార్త ఈ పేపర్‌ల కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/