క్రికెట్‌ కోచ్‌ అచ్రేకర్‌ కన్నుమూత

Sachin teacher Achrekar passed away
Sachin teacher Achrekar passed away

ముంబయి: ద్రోణాచార్య పురస్కార గ్రహీత, ప్రముఖ క్రికెట్‌ కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌‌ (87) ఇక లేరు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌కు ఆటలో ఓనమాలు దిద్దించిన ఆయన బుధవారం సాయంత్రం కన్నుమూశారు. పెద్దవారైన అచ్రేకర్‌ వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ‘ఆయన (అచ్రేకర్‌ సర్‌) మనకిక లేరు. ఈ రోజు సాయంత్రం కన్నుమూశారు’ అని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ప్రపంచానికి తిరుగులేని క్రికెటర్‌ సచిన్‌ను తీర్చిదిద్దిన ఘనత అచ్రేకర్‌కే చెందుతుంది. వినోద్‌ కాంబ్లి, ప్రవీన్‌ ఆమ్రె, సమీర్‌ దిఘె, బల్విందర్‌ సింగ్‌ సంధు, అజిత్‌ అగార్కర్‌ వంటి క్రికెటర్లకు ఆయన శిక్షణ నిచ్చారు.