వైభవ్‌ గెహ్లాట్‌ ఓటమికి సచిన్‌ బాధ్యత వహించాలి

రాజస్థాన్‌ సియం అశోక్‌ గెహ్లాట్‌

sachin pilot, ashok gehlot
sachin pilot, ashok gehlot

జైపూర్‌: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్‌కు మంచి పట్టున్న జోధ్‌పూర్‌లో సియం అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ కూడా ఓటమిపాలయ్యాడు. ఐతే ఈ విషయంపై అశోక్‌ గెహ్లాట్‌ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..తన కుమారుడి ఓటమి బాధ్యత రాజస్థాన్‌ ఉప ముఖ్యమంత్రి ,సచిన్‌ పైలెటే తీసుకోవాలని అన్నారు. భారీ మెజార్టీతో గెలుస్తామని ఆయన అన్నారు. అక్కడ మనకు ఆరుగురు ఎమ్మెల్యేలున్నారని, ప్రచారం కూడా పెద్దఎత్తున చేశామని అన్నారు. కానీ కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కనీసం జోధ్‌పూర్‌లో ఓటమి బాధ్యత ఐనా సచిన్‌ పైలట్‌ తీసుకోవాలని గెహ్లాట్‌ అన్నారు. ఐతే జోధ్‌పూర్‌ టికెట్‌ వైభవ్‌కు ఇవ్వాలని హైకమాండ్‌ను సచిన్‌ పైలట్‌ కోరినట్లు తెలుస్తుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/