పంబా న‌దిలో వ‌ర‌ద ఉధృతి..శ‌బ‌రిమ‌ల‌లో ద‌ర్శ‌నాలు నిలిపివేత‌

తిరువ‌నంత‌పురం : కేర‌ళ‌లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాల‌కు కేర‌ళ‌లోని అన్ని జ‌లాశ‌యాలు నిండిపోయాయి. పంబా న‌దిలో వ‌ర‌ద ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. పంబా న‌దిలో వ‌ర‌ద ఉధృతి దృష్ట్యా.. పంబా, శ‌బ‌రిమ‌ల‌కు యాత్రికుల‌ను అధికారులు అనుమ‌తించ‌డం లేదు. పంబా, శ‌బ‌రిమ‌ల‌లో శ‌నివారం ద‌ర్శ‌నాలు నిలిపివేస్తూ జిల్లా కలెక్ట‌ర్ దివ్య ఎస్ అయ్య‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. యాత్రికులంతా స‌హ‌క‌రించాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వం కోరింది. భ‌ద్ర‌త దృష్ట్యా మాత్ర‌మే యాత్రికుల‌ను అనుమ‌తించ‌ట్లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/