కాఫీడే బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా రంగనాథ్‌

పరిస్థితులు చక్కబడే వరకూ ఎస్‌వీ రంగనాథ్ తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించనున్నారు

SV Ranganath
SV Ranganath

బెంగళూరు: వి.జి సిద్ధార్థ మరణంతో కేఫ్‌ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా ఎస్‌.వి.రంగనాథ్‌ను నియమించారు.ఇప్పటికే ఆయన బోర్డులో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈరోజు బెంగళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి సమావేశం ఆగస్ట్ 8న ఉంటుందని డైరెక్టర్స్ తెలిపారు. నితిన్ బగ్మనే తాత్కాలిక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఎస్‌వీ రంగనాథ్ ఇన్నాళ్లూ సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. పరిస్థితులు చక్కబడే వరకూ ఎస్‌వీ రంగనాథ్ తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. 1975 కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన రంగనాథ్‌ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్‌ సెక్రటరీగా కూడా విధులు నిర్వహించారు. గతంలో అబుదాబిలోని ఇండియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌సెంటర్‌ బోర్డు డైరెక్టర్లలో రంగనాథ్‌ ఒకరు.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/