గుజరాత్ నుంచి మంత్రి జయశంకర్ నామినేషన్

గాంధీనగర్: జూలై 5న రాజ్యసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన గుజరాత్ నుంచి పోటీ చేయనున్నారు. ఆయన గత నెల 30న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆ తేదీ నుంచి ఆరు నెలల్లోగా ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ నాయకురాలు స్మృతి ఇరానీ లోక్సభకు ఎన్నికవ్వగా తమ రాజ్యసభ సభ్యత్వాలకు వారు రాజీనామా చేశారు. ఆ రెండు స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.
తాజా హీరోయిన్ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/