నిధుల సమీకరణకు ఎస్‌ బ్యాంకు!

కొత్త వారికి బోర్డులో స్థానం

yes bank
yes bank

ముంబై: ప్రైవేట్‌ రంగ బ్యాంకు అయిన ఎస్‌ బ్యాంకు డిసెంబరు నెలలోగా 1.2బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల ప్రక్రియను పూర్తిచేయనుంది. అలాగే కొత్త ఇన్వెస్టర్లకు బోర్డులో స్థానంలో కల్పించాలని భావిస్తోంది. నిధుల సమీకరణ కోసం కొందరు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామని, సుమారు 3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఎస్‌ బ్యాంకు తెలిపింది. నార్త్‌ అమెరికన్‌ ఫ్యామిలీస్‌ ఆఫీస్‌ ఇప్పటికే 1.2బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు ఆఫర్‌ ఇచ్చింది. అంటే మన రూపాయల్లో దాదాపు రూ.8,462 కోట్లకుపైగా, దీనిపై నవంబరు నెలాఖరులో ఆ సంస్థకు తమ అభిప్రాయం తెలియచేయాల్సి ఉందని ఎస్‌ బ్యాంకు సిఇఒ తెలిపారు. ఆ సంస్థ నుంచి గానీ, ఇతర ఇన్వెస్టర్లందరి నుంచి కలిపి డిసెంబరు నాటికి నిధుల సమీకరణ చేస్తామన్నారు. రుణవృద్ధిని మెరుగుపరుచుకోవడానికి నిర్దేశించుకున్నందున రానున్న రెండేళ్ల అవసరాలకు ఈ ఫండ్స్‌ సరిపోతాయని భావిస్తున్నట్లు సిఇఒ తెలిపారు. మరోవైపు, సెప్టెంబరు నెలతో ముగిసిన త్రైమాసికంలో నిరర్ధక ఆస్తులు పెరిగేందుకు కొన్ని సంస్థలకు ఇచ్చిన రుణాలు అకస్మాత్తుగా ఒత్తిడికి గురవ్వడమే కారణమని ఎస్‌ బ్యాంకు వెల్లడించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/