దసరా నాటికి రైతువేదికలు

మంత్రి నిరంజన్‌రెడ్డి

TS Minister Niranjan Reddy
TS Minister Niranjan Reddy

Hyderabad: అన్నదాత ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో దసరా నాటికి రైతువేదికలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు  మండలిలో మంత్రి సమాధాన మిచ్చారు. లాభదాయక పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.

తెలంగాణ సోనాతో పంట రాబడి ఎక్కువగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా సాగవుతున్నదని చెప్పారు.

దేశంలో మొదటిసారిగా ప్రతి రైతు పంటను రికార్డు చేస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలో కోటి 31 లక్షల 50 వేల ఎకరాల్లో పంట సాగవుతున్నదని చెప్పారు. పపðధాన్యాల పంటలను మరింతగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/