కోటి 33 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం

పటాన్‌చెరు దర్గాలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావు

Minister Harish Rao

సంగారెడ్డి: పటాన్‌చెరు దర్గాలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన ఎంపీలు ప్రభాకర్‌ రెడ్డి, బీబీ పాటిల్‌తో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ..రాష్ట్రంలో రైతుబంధు కింద రూ.6,888.43 కోట్లు జమచేశామని హరీశ్‌ రావు ప్రకటించారు. మొత్తం 54.22 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యిందని చెప్పారు. మొత్తం కోటి 33 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందించామన్నారు. సిఎం ఆదేశాల మేరకు 3 రోజుల్లోనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నగదు బదిలీ చేశామని వెల్లడించారు. రైతును శక్తిగా మార్చడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంగారెడ్డి జిల్లాలో 116 రైతువేదికలు ఉన్నాయని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/