జూన్‌ మొదటివారంలో రైతుబంధు

rythu bandhu
rythu bandhu

హైదరాబాద్‌: తెలంగాణలో వానకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పథకం అమలుకు వ్యవసాయశాఖ సిద్ధమవుతున్నది. అవసరమైన నిధులు సిద్ధంగా ఉంచినట్టు ఆర్థికశాఖ ప్రకటించింది. ఎన్నికల కోడ్ ముగియగానే.. ఈ నెల చివరివారం నుంచి జూన్ మొదటివారంలోగా రైతుబంధు సొమ్మును ఆన్‌లైన్ పద్ధతిలో ఆయా రైతుల బ్యాంకుఖాతాల్లో జమచేస్తామని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైతుల వివరాలు, బ్యాంకుఖాతాలు, కొత్తవారి నమోదు తదితర వివరాలను చేర్చే విషయంలోనూ వ్యవసాయశాఖకు దిశానిర్ధేశం చేశారు. వానకాలం సీజన్‌లో రైతుబంధు పథకం కింద రైతులకు రూ.6వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. తొలకరి వర్షాలు కురిసేనాటికి, సాగు మొదలుకు ముందు రైతులందరికీ పెట్టుబడిసాయం అందజేయాలని సర్కారు కృతనిశ్చయంతో ఉన్నది. గతేడాది ప్రభుత్వం ఒక్కోసీజన్‌కు రైతుకు ఎకరానికి రూ.నాలుగువేల చొప్పున ఇచ్చింది. ఈసారి దానిని రూ.ఐదువేలకు పెంచిన సంగతి తెలిసిందే.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/