ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలు

ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దంటూ పుతిన్ హెచ్చరికలు

Russia's war on Ukraine
Russia’s war on Ukraine

ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌పై రష్యా దృష్టి సారించింది. ఇదిలా ఉండగా, మిలటరీ ఆపరేషన్ మొదలైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ సైన్యం తన ఆయుధాలను విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు. ఇతర దేశాలు ఈ అంశంలో జోక్యం చేసుకోవద్దని ఆయన హెచ్చరికలు చేశారు . ఎవరైనా జోక్యం సెహెసుకుంటే ‘ఇదివరకు ఎన్నడూ చూడని పరిణామాలు చూడాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరికలు పంపారు. తాజాగా , ప్రజలను ఉద్దేశించి టెలివిజన్​ ద్వారా పుతిన్ ప్రసంగించారు. ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పుకు స్పందనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులదే బాధ్యత అని చెప్పారు. ఇప్పటికే ఉక్రెయిన్‌లో నాలుగుచోట్ల రష్యా మిస్సైల్ ఎటాక్స్ చేయటం జరిగిందని అన్నారు. . త్రిశూలవ్యూహంతో ఉక్రెయిన్‌ని చుట్టేసిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ – రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులతో ప్రపంచదేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/