రష్యాను యుద్ధంలోకి లాగేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోంది

మాస్కో : అమెరికాపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రష్యాను యుద్ధంలోకి లాగాలని ఆ దేశం ప్రయత్నిస్తున్నదని, ఉక్రెయిన్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను వినియోగించుకొని మరిన్ని ఆంక్షలు విధించాలనేది వారి లక్ష్యమని పేర్కొన్నారు. ఈయూలో నాటో విస్తరణ విషయంలో రష్యా ఆందోళనలను అమెరికా విస్మరిస్తున్నదని పుతిన్ అన్నారు. రష్యాకు విచ్చేసిన హంగేరీ ప్రధాని విక్టోర్ ఆర్బాన్‌తో మంగళవారం భేటీ అనంతరం పుతిన్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునేందుకు రష్యా ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలను ఖండించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/