8వ అంతస్తుపై నుంచి పడినా బతికిన మహిళ

సైబీరియా: భూమి మీద ఇంకా బతికి ఉండే అవకాశం రాసి పెట్టి ఉందన్నట్లు .. ఆ మహిళ విషయంలో అదే జరిగింది. 90 అడుగులు 8 ఫ్లోర్ల అంతస్తు నుంచి పడిపోయినా .. ఏమీ కానట్లు .. లేచి నిలబడి తాపీగా నడుచుకుంటూ వెళ్లింది. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ.. అకస్మాత్తుగా 8 అంతస్తుల భవనం నుంచి కిందకు పడిపోయింది. భవనం మీద నుంచి పడిపోయేటప్పుడు .. చెట్లు కానీ.. కరెంటు వైర్లు కానీ .. భవనానికి సంబంధించిన కిటికీల తలుపులు .. ఇలా ఏవీ అడ్డం రాలేదు. దీంతో సరిగ్గా ఆమె నేల మీద పడిపోయింది. పడడం.. పడడం .. మంచు కుప్ప మీద పడింది. అంత ఎత్తు నుంచి కింద పడ్డనప్పటికీ చిన్న గాయం కూడా కాలేదు. సరిగ్గా ఒక్క నిముషానికి తాపీగా లేచి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఇంతకీ ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి కిందకు దూకిందా.. ప్రమాదవశాత్తూ పడిపోయిందా .. అసలు ఏం జరిగిందనే విషయం తెలియడం లేదు. ప్రస్తుతం మహిళను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/