ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం.. మహిళా జర్నలిస్ట్‌ మృతి

కీవ్: ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధాని కొన‌సాగిస్తూనే ఉంది. దేశ రాజధాని కీవ్‌లో రష్యన్‌ బలగాలు గుండ్ల వర్షం కురింపించడంతో రష్యాకు చెందిన మహిళా జర్నలిస్టు మృతిచెందింది. పరిశోధనాత్మక వార్తా సంస్థ ది ఇన్‌సైడర్‌కు చెందిన జర్నలిస్టు ఓక్సానా బౌలినా మరణించిందని ఆ సంస్థ ప్రకటించింది. కీవ్‌లో రష్యా దళాలు సృష్టించిన విధ్వంసాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు మృతిచెందిందని తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. ఈ దాడిలో మరో పౌరుడు కూడా మరణించాడని, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని చెప్పింది.

బౌలినా గతంలో రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ అవినీతి నిరోధక బృందంలో పనిచేశారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో బౌలినా క్షేత్రస్థాయిలో ఇన్‌సైడర్‌ కోసం పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా పశ్చిమ ఉక్రెయిన్‌లోని కీవ్, ఎల్వివ్‌ నుంచి అనేక వార్తా కథనాలను ఆమె అందించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/