సుమీలోని రసాయన ప్లాంట్‌పై రష్యా దాడి..భారీగా అమ్మోనియా లీక్
2.5 కిలోమీటర్ల దూరం వరకు దీని ప్రభావం ఉంటుందన్న గవర్నర్

కీవ్: ఉక్రెయిన్‌పై దాడులకు తెగబడుతోన్న రష్యా ఓ రసాయన ప్లాంట్‌పై బాంబులు వేసి కలకలం రేపింది. దీంతో ఉక్రెయిన్‌లోని సుమీ నగర సమీపంలో ఉన్న సుమీఖింఫోరమ్ కెమికల్ ప్లాంట్ నుంచి భారీగా అమ్మోనియా వాయువు లీకవుతోంది. ఆ ప్లాంటుకు 2.5 కిలోమీటర్ల దూరం వరకు దీని ప్రభావం ఉంటుందని అక్కడి గవర్నర్ తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా ప్రాంతాల ప్రజలు వెంటనే అండర్ గ్రౌండ్‌లలోకి వెళ్లాలని పేర్కొన్నారు.
ఇప్పటికే మరియుపోల్‌ను రష్యా ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. మిగతా ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవడానికి రష్యా ప్రయత్నాలు జరుపుతోంది. రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ పుతిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఉక్రెయిన్‌పై సైనిక చర్యలను కొనసాగిస్తున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/