ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంక్‌ల‌ను ఇవ్వనున్న అమెరికా-జ‌ర్మ‌నీ

Russia-Ukraine war: US and Germany don ready to send tanks to Ukraine – reports

కీవ్‌: ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ర‌ష్యాను ఎదుర్కొనేందుకు త‌మ‌కు యుద్ధ ట్యాంక్‌లు కావాల‌ని కొన్నాళ్ల నుంచి ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆ దేశానికి యుద్ధ ట్యాంక్‌ల‌ను పంపేందుకు అమెరికా, జ‌ర్మ‌నీ దేశాలు నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ రెండు అగ్ర‌దేశాలు యుద్ధ ట్యాంక్‌ల‌ను పంపిస్తే.. అప్పుడు ఉక్రెయిన్ వార్ కొత్త రూపం దాల్చే అవ‌కాశాలు ఉన్నాయి.

అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ దీనిపై త్వ‌ర‌లో ఓ ప్ర‌ణాళిక‌ను వెల్ల‌డించ‌నున్నారు. సుమారు 30 ఎం1 అబ్రామ్స్ ట్యాంకుల‌ను పంపాల‌ని అమెరికా భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక క‌నీసం 14 లియోపార్డ్ 2 ట్యాంక్‌ల‌ను ఉక్రెయిన్‌కు పంపించాల‌ని జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఓలాఫ్ స్క‌ల్జ్ భావిస్తున్నారు.

ఈ నిర్ణ‌యాన్ని ర‌ష్యా తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. అమెరికాలో ఉన్న ర‌ష్యా అంబాసిడ‌ర్ దీన్ని త‌ప్పుప‌ట్టారు. ఇది మ‌ళ్లీ రెచ్చ‌గొట్ట‌డ‌మే అవుతుంద‌న్నారు. యుద్ధ ట్యాంక్‌లు వ‌స్తే ర‌ష్యా ఆధీనంలోకి వెళ్లిన త‌మ ప్ర‌దేశాల‌ను మ‌ళ్లీ చేజిక్కించుకోవ‌చ్చు అని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/