రష్యాలో తగ్గుముఖం పట్టిన కరోనా !

కొత్తగా 6,556 మందికి కరోనా కేసులు నమోదు

రష్యాలో తగ్గుముఖం పట్టిన కరోనా !
Corona cases – Russia

రష్యా: రష్యాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి క్రమంగా తగ్గుతున్నది. కరోనా ధాటికి విలవిల్లాడిన మాస్కో కోలుకుంటోంది. గత వారం రోజుల నుంచి పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. కొన్నిరోజుల నుంచి 7వేల కన్నా తక్కువగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. రష్యాలో బుధవారం కొత్తగా 6,556 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,54,405కు చేరింది. గడచిన 24 గంటల్లో మరో 216 మంది చనిపోవడంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 9,535కు పెరిగింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/