ఆగస్టు 10 లోపు రష్యా వ్యాక్సిన్‌!

ఆగస్టు 10 లోపు రష్యా వ్యాక్సిన్‌!
corona vaccine

మాస్కో: ప్రపంచవ్యాప్తింగా కరోనా వైరస్‌ చిక్సితకు వ్యాక్సిన్‌ కోసం ప్రయత్నలు జరుగుతున్న విషయం తెలిసింది. అయితే ఈనేపథ్యంలోనే కరోనా చికిత్సకు అందరికంటే ముందుగానే వ్యాక్సిన్‌ను తీసుకురానున్నట్టు ప్రకటించిన రష్యా ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది. ఆ దేశానికి చెందిన గమేలియా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌కు ఆగస్టు 10లోపు అనుమతులనిచ్చి ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ఆ దేశ అధికారులు వెల్లడించారు. తొలుత వైరస్‌ సోకిన వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ను అందిస్తామని, ఆ తర్వాత ప్రజలకు సరఫరా చేస్తామని తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/