ర‌ష్యా ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఉగ్ర‌వాద సంస్థ‌గా మారింది : జెలెన్‌స్కీ

president-zelensky

కీవ్ : ర‌ష్యా ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఉగ్ర‌వాద సంస్థ‌గా మారింద‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. క్రెమెన్‌చుక్ ప‌ట్ట‌ణంలోని షాపింగ్ సెంట‌ర్‌పై మిస్సైల్ అటాక్ జ‌రిగిన నేప‌థ్యంలో జెలెన్‌స్కీ స్పందించారు. ర‌ష్యా ఉగ్ర‌వాదాన్ని అడ్డుకోవాల‌ని అంత‌ర్జాతీయ స‌మాజాన్ని ఆయ‌న కోరారు. క్రెమిన్‌చుక్‌పై దాడితో పుతిన్ నేతృత్వంలోని ర‌ష్యా ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఉగ్ర‌వాద దేశంగా మారిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. షాపింగ్ సెంట‌ర్‌పై దాడిలో మృతుల సంఖ్య 18కి చేరింది. ర‌ష్యా మ‌రిన్ని దాడులు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు జెలెన్‌స్కీ ఆరోపించారు. శిథిలాల కింద ఉన్న వారి కోసం గాలిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌పంచంలోని అత్యంత శ‌క్తివంత‌మైన ప్ర‌జాస్వామ్య దేశాల‌న్ని త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నాయ‌ని, తాము విజ‌యం సాధించే వ‌ర‌కు మ‌ద్ద‌తు ఇస్తాయ‌ని, ఉక్రెయిన్ ఎన్న‌టికీ విఫ‌లం కాద‌ని జెలెన్‌స్కీ అన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/