భారత్‌కు మరోసారి రష్యా మద్దతు

Nikolay Kudashev
Nikolay Kudashev

రష్యా: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై రష్యా మరోసారి మద్దతుగా నిలిచింది. రష్యా రాయబారి నికోలాయ్‌ కుడాషేవ్‌ మీడియాతో మాట్లాడుతూ ఆర్టికల్‌ 370 రద్దు అనేది భారత ప్రభుత్వం తీసుకున్న సార్వభౌమ నిర్ణయం. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సమస్యలన్నీ సిమ్లా ఒప్పందం ద్వారానే జరుగుతాయి. అది భారత అంతర్గత నిర్ణయం అని పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370, 37ఏలను రద్దు చేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని మొట్టమొదట సమర్థించిన దేశాల్లో రష్యా కూడా ఉన్న సంగతి తెలిసిందే.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/