రష్యా, టర్కీ ఒప్పందం

ఇడ్లిబ్‌ కాల్పుల విరమణపై ఒప్పందం

Russia and Turkey Agree on Idlib Ceasefire
Russia and Turkey Agree on Idlib Ceasefire

మాస్కో : గత కొద్ది రోజులుగా బాంబు దాడులతో దద్దరిల్లుతున్న సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రాంతంలో కాల్పుల విరమణపై రష్యా, టర్కీలు ఒక ఒప్పందానికి వచ్చాయి. గత మూడు మాసాల్లో దాదాపు 10లక్షల మంది నిర్వాసితులవడానికి దారి తీసిన ఘర్షణలను అదుపు చేసేందుకు మాస్కోలో ఈ ఇరువురు నేతలు సమావేశమై చర్చించారు. ఇరువురు నేతలు ఈ మేరకు ఒక ఒప్పందాన్ని కుదర్చుకున్నారు. దీంతో ఇడ్లిబ్‌లో ఘర్షణలు ఆగిపోతాయని ఇరువురు నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇడ్లిబ్‌లో సైనిక కార్యకలాపాలు నిలిచిపోవడానికి, ప్రజల ఇబ్బందులు తగ్గడానికి ఈ ఒప్పందం మంచి పునాది కాగలదని ఆశిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి నుండి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ తెలిపారు. సిరియాకు అవసరమైన సాయమందించడానికి ఇరువురం కలిసి కృషి చేస్తామన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/