ఏదో ఓ సమయంలో భారత్‌లో పర్యటిస్తాను

మోడి నాకు మంచి మిత్రుడు

trump
trump

అమెరికా: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడుతూ… భారత ప్రధాని మోడి తనకు మంచి మిత్రుడని తెలిపారు. తాను ఇటీవలే హ్యూస్టన్‌ లో మోడిని కలిసి వేదికను పంచుకున్నానని గుర్తు చేశారు. ఇటీవల హ్యూస్టన్‌ లో నిర్వహించిన ‘హౌడీమోడి’ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్న నేపథ్యంలో.. ట్రంప్‌ ని కుటుంబసమేతంగా భారత పర్యటనకు రావాలని మోడి ఆహ్వానించారు. కాగా ఏదో ఓ సమయంలో తాను భారత్‌ లో పర్యటిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. భారత్‌ తో అమెరికా మెరుగైన సంబంధాలను కొనసాగిస్తోందని చెప్పారు. ఇరు దేశాల మధ్య చాలా అంశాలపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచడంతో భారత్‌ కూడా ఆ దేశ వస్తువులపై సుంకాలు పెంచింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు వచ్చాయి. వీటిని తొలగించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/