రోలింగ్‌పిన్లతో సులభంగా కుకీలు

వంటా వార్పు

Easy cookies with rolling pins
Easy cookies with rolling pins

చపాతీలు, పూరీలు, అప్పడాలూ లేదా కుకీల్లాంటివి తయారు చేసినప్పుడు పిండిని నొక్కడానికి వాడే అప్పడాల కర్రలు మనకు సుపరిచితమే.

ఇన్నాళ్లూ పిండి ముద్దను సమానంగా చేసేందుకే వీటిని వాడాం. మామూలుగా కర్రతో చేసి సాదాగా ఉండే వీటి మీద ఇప్పుడు డిజైన్ల వస్తున్నాయి.

ఎంబోజింగ్‌ లేదా డిజైనర్‌ రోలింగపిన్‌లుగా పిలుస్తున్న వీటిని కుకీలూ, కేకుల ఫాండెంట్‌, పాస్తాల్లాంటి వాటి మీద అందమైన అచ్చుల్ని తీసుకొచ్చేందుకు వాడుతున్నారు.

ముఖ్యంగా కుకీలను అందంగా అలంకరించడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. వీటి వాడకం కూడా చాలా సులభం.

కుకీలు తయారు చేసేందుకు పిండిన చపాతీలా చేశాక ఒకసారి ఈ రోలింగ్‌పిన్లతో అప్పడాన్ని నొక్కినట్టు నొక్కితే సరి, దాని మీద కుకీ కట్టర్ల సాయంతో మనకు నచ్చిన ఆకృతిలోకి తెచ్చుకుని ఓవెన్‌లో బేక్‌ చేసుకోవడమే.

కేక్‌ ఫాండెంట్‌ మీదా ఇలాగే చూడచక్కటి అచ్చుల్ని తెచ్చేయొచ్చు. అందమైన పూలు, లతలూ, పక్షులూ, జింకలూ, గంటలు, పుర్రె బొమ్మలు, సీతాకోక చిలుకలూ ఇలా విభిన్న ఆకృతులూ చక్కటి డిజైన్లలో ఈ అప్పడాల కర్రలు వస్తున్నాయి.

ఇవి ఆక స్టమైజ్డ్‌ రోలింగ్‌ పిన్ల పేరుతో మరోరకం కూడా దొరుకుతున్నాయి. ఆ తరమా వాటిమీద మన పేరు వచ్చేలా రోలింగ్‌పిన్‌ను ఆర్డరిచ్చి తయారు చేయించుకోవచ్చు.

అంటే బిస్కెట్‌ మధ్యలో బ్రిటానియా, హార్లిక్స్‌, పార్లే ఇలా పేర్లు ఎలా వస్తాయో అదే తరహాలో కుకీలూ, కేకుల మీద మన పేరు వచ్చేలా చేసేందుకు ఇవి ఉపయోగపడతాయన్నమాట.

ఇక, ఈ తరహా అప్పడాల కర్రలు చెక్కతోనే కాకుండా, సిలికాన్‌, ప్లాస్టిక్‌ లాంటి వాటితోనూ తయారై వస్తున్నాయి.

మామూలు అప్పడాల కర్రకు ఈ రకం డిజైన్లు వచ్చేలా అచ్చును కర్రను తొడిగి తీసి పెట్టుకునేలా ప్రత్యేక బేకింగ్‌ సెట్లూ వస్తున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/