కారం పొడులు

రుచి: వంటా వార్పు

Chilli powders
Chilli powders

చింత చిగురు పొడి

కావలసిన పదార్థాలు: చింతచిగురు 225 గ్రా, ఎండుమిర్చి-12
ధనియాలు-అరకప్పు, మినప్పుప్పు-పావు కప్పు, ఉప్పు-రుచికి సరిపడా, నూనె-6టీస్పూన్లు, ఆవాలు, జీలకర్ర-పావుటీ స్పూను చొప్పున

తయారు చేసే విధానం:
ముందుగా చింతచిగురు నలిపి శుభ్రం చేసుకుని పుల్లలు, ఈనెలు తీసెయ్యాలి.

పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె కాగిన తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఒకటి తర్వాత ఒకటి వేగించుకోవాలి. తర్వాత చింతచిగురు వేసి వేగించాలి.

ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత రుచికి సరిపగా ఉప్పు వేసి రోట్లో మెత్తగా దంచుకోవాలి. ఈ పొడి ఇడ్లీ దోశెలతో పాటు అన్నంలో కూడా రుచిగా ఉంటుంది.

వెల్లుల్లి కారం

కావలసిన పదార్థాలు: వెల్లులి-ఒక పర్తి గడ్డ, ఎండుమిర్చి-12
మినప్పుప్పు – ఒక టేబుల్‌ స్పూను, జీలకర్ర-పావ్ఞటీ స్పూను
ధనయాలు-3, స్పూను, కరివేపాకు-4రెబ్బలు, చింతపండు- ఉసరి కాయంత, ఉప్పు-రుచికి సరిపడా, నూనె-4 టీస్పూన్లు

తయారు చేసేవిధానం:
స్టౌమీద మూకుడు పెట్టి నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు దోరగా వేగించి దించేయాలి. అన్ని చల్లారిన తర్వాత ఉప్పు, చింతపండు రెబ్బలు వేసి రోట్లో దంచుకోవాలి.

అన్నీ నలిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు (పొట్టుతో) వేసి మరోసారి దంచాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో పొడిపొడిగా విడదీసి ఆరబెట్టి సీసాలో భద్రపరచుకోవాలి. పొడిని మొదటి ముద్దలో నెయ్యితో కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదని అంటారు.

పుదీనా పొడి

కావలసిన పదార్థాలు: పుదీనా ఆకులు- 2 కప్పులు, ఎండుమిర్చి-15,
ధనియాలు- అరకప్పు, మినప్పప్పు -పావ్ఞ కప్పు
నూనె-3 స్పూన్లు, చింతపండు రుచికోసం ఉప్పు-తగినంత

తయారు చేసే విధానం:

పుదీనా ఆకులు శుభ్రం చేసి తడి లేకుండా గాలికి బాగా ఆరబెట్టాలి. మూకుడులో నూనె కాగగానే మిండుమిర్చి, ధనియాలు, మినప్పప్పు వేసి దోరగా వేగించాలి.

తర్వాత అందులోనే పుదీనా ఆకులు వేసి పళపళమనే వరకు వేగించాలి. మిశ్రమం చల్లారిన తర్వాత చింతపండు, ఉప్పు కలిపి మెత్తగా దంచుకోవాలి. ఈ పొడిని అన్నంతో పాటు ఇడ్లీ, దోశె, ఊతప్పం, ఉప్మావంటి టిఫిన్స్‌లో బాగుంటాయి.

నువ్వుల పొడి

కావలసిన పదార్థాలు: నువ్వు పప్పు-200గ్రా
ఎండు మిరపకాయలు-8, ఉప్పు తగినంత

తయారు చేసే విధానం:

స్టౌమీద బాండీ పెట్టి ఊనె వేయకుండా మీడియం సెనగనువ్వు పప్పు, ఎండుమిరపకాయలు కమ్మని వాసన వచ్చేవరకు వేయించుకోవాలి.

చల్లారగానే మిక్సీలో తగినంత ఉప్పు వేసి మెత్తగా సుకుని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. కావలసినప్పుడు తీసుకుని అన్నంలోకి, కూరల్లోకి వాడుకోవచ్చును. ఇలా కొట్టిన నువ్వుపప్పు ఒడి పదిహేను రోజులుపైనే నిల్వ ఉంటుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/